- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అస్సాం అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
అస్సాం అసెంబ్లీలో హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'యూనిఫామ్ సివిల్ కోడ్' (UCC) బిల్లును ప్రవేశపెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: అస్సాం (Assam) సీఎం హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిష్టాత్మక ‘అస్సాం యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు’ను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో సామాజిక సంస్కరణలు తీసుకొచ్చేందుకు, మహిళల హక్కులను కాపాడటానికి ఈ బిల్లు ఎంతో కీలకమని ప్రభుత్వం పేర్కొంది. ఈ సరికొత్త యూసీసీ బిల్లు ప్రకారం.. అస్సాం రాష్ట్రవ్యాప్తంగా బహుభార్యాత్వం (Polygamy), బాల్యవివాహాలను (Child Marriages) పూర్తిగా నిషేధించనున్నారు. కుల, మతాలతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వ హక్కులు, దత్తత విషయాల్లో అందరికీ ఒకే రకమైన చట్టం వర్తిస్తుంది. వివాహాల నమోదును తప్పనిసరి చేయడంతో పాటు, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లకు సంబంధించిన నిబంధనలను కూడా ఇందులో పొందుపరిచారు.
గిరిజన తెగలకు మినహాయింపు..
అస్సాంలో విస్తృతంగా ఉన్న స్థానిక సంస్కృతులు, సాంప్రదాయాలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ బిల్లులో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ పరిధిలోకి వచ్చే గిరిజన ప్రాంతాలు, తెగలకు ఈ యూసీసీ నిబంధనల నుండి పూర్తిగా మినహాయింపు (Exemption) ఇచ్చారు. వారి సాంప్రదాయ హక్కులలో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. ఇప్పటికే ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టాన్ని రద్దు చేసిన అస్సాం ప్రభుత్వం.. ఈ యూసీసీ బిల్లు ద్వారా చట్టవిరుద్ధ వివాహాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. విపక్షాల నిరసనల మధ్య అసెంబ్లీ ముందుకు వచ్చిన యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ఆమోదం పొందుతుందో లేదో వేచి చూడాల్సిందే మరి.






