- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రంప్ అదనపు టారిఫ్.. విదేశాంగ శాఖ ఆగ్రహం
యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నేడు భారత్‌పై 25% అదనపు సుంకాలు(Taxes) విధిస్తూ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నేడు భారత్‌పై 25% అదనపు సుంకాలు(Taxes) విధిస్తూ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంపై భారత విదేశాంగ శాఖ (MEA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేస్తుందనే నెపంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోందని, ఇది చాలా అన్యాయమైన, అసమంజసమైన నిర్ణయం అంటూ మండిపడింది. ఈ మేరకు విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో.. భారత్ రష్యా నుండి చమురు దిగుమతి చేసుకోవడం దేశ ప్రజల ప్రయోజనాలకు సంబంధించినదిగా పేర్కొంది. యూరోపియన్ యూనియన్ 2024లో రష్యాతో 67.5 బిలియన్ యూరోల వాణిజ్యం కొనసాగిస్తుండగా.. కేవలం భారత్‌ను విమర్శించడంలో పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరని విదేశాంగశాఖ ఎత్తి చూపింది.
ఈ సుంకాలు భారత ఎగుమతులపై, ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆభరణాల వంటి రంగాలపై ప్రభావం చూపనున్నాయని, ఇది MSMEలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ, భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని, రష్యా నుండి చమురు దిగుమతులు కొనసాగిస్తామని పునరుద్ఘాటించింది. కాగా భారత్ ఎగుమతులపై అమెరికా ఇదివరకే 25 శాతం పన్నులు విధించగా నేడు మరో 25 శాతం విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ట్రంప్ సంతకాలు చేసారు. దీంతో మొత్తం పై 50 శాతం పన్నులు మోపబడతాయి. ఈ నిర్ణయం ఈనెల 27 నుంచి అమల్లోకి రానుంది.






