విరాట్ కోహ్లీకి ఊహించని షాక్.. బెంగళూరులో కేసు నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-02 05:05:06  IST  )

టీమిండియా (Team India) బ్యాటింగ్ సెన్సేషన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఊహించని షాక్ తగిలింది.

విరాట్ కోహ్లీకి ఊహించని షాక్.. బెంగళూరులో కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా (Team India) బ్యాటింగ్ సెన్సేషన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఊహించని షాక్ తగిలింది. ఈ మేరకు బెంగళూరు (Bengaluru)లోని వన్ 8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్‌పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కస్తూర్బా రోడ్డులోని విరాట్ కోహ్లీ వన్ 8 పబ్‌పై కబ్బన్ పార్క్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అయితే, నిబంధనకు విరుద్ధంగా పబ్‌లో స్మోకింగ్ చేసేందుకు సపరేట్ ఏరియా లేకపోవడాన్ని వారు గుర్తించారు. ఈ మేరకు నిబంధనలు అతిక్రమించినందుకు గాను.. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA)లోని సెక్షన్-4, 21 ప్రకారం వన్ 8 పబ్ మేజేజర్‌తో పాటు సిబ్బందిపై కేసులు నమోదు చేసినట్లుగా కబ్బన్ పార్క్ ఎస్సై అశ్విని తెలిపారు.

Next Story