- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
27.2 కోట్ల మంది స్కూళ్లకు దూరం.. లెక్కలు తేల్చిన యునెస్కో!
27.2 కోట్ల మంది విద్యార్థులు స్కూళ్లకు దూరం. లెక్కలు తేల్చిన యునెస్కో.. దీనికి రెండు విషయాలు కారణం అని తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లకు వెళ్లని చిన్నారుల సంఖ్య సుమారు 27.2 కోట్లుగా ఉందని యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ టీం (జీఈఎం) ప్రకటించింది. గతంలో కంటే ఇది 2.1 కోట్లు ఎక్కువని తెలిపింది. తాజా నివేదిక ప్రకారం, ప్రపంచ దేశాలు పిల్లల లక్ష్యాల్లో కనీసం 7.5 కోట్ల లెక్కతప్పుతుందని యునెస్కో పేర్కొంది. ఇలా స్కూళ్లకు వెళ్లని పిల్లల సంఖ్య పెరగడానికి రెండు కారణాలున్నట్లు ఈ సంస్థ చెప్పింది. మొదటి కారణం ఏంటంటే.. ఈ పెరిగిన 2.1 కోట్లలో 38 శాతం లేదా 80 లక్షల వరకు కొత్తగా స్కూళ్లకు వెళ్లే వారి సమాచారం ఉంటుందని, అయితే అఫ్ఘానిస్తాన్‌లో 2021 నుంచి అమ్మాయిలు సెకండరీ స్కూల్ విద్యను నిషేధించడం దీనిపై ప్రభావం చూపిందని యునెస్కో వివరించింది.
ఇక రెండో అంశం ఐక్యరాజ్యసమితి జనాభా పెరుగుదల అంచనాలని తెలిపింది. యునెస్కో లెక్కల్లో 1.3 కోట్లు లేదా మిగతా 62 శాతం ఈ జనాభా అంచనాలేనని చెప్పింది. గతంతో పోలిస్తే స్కూళ్లకు వెళ్లే 6 నుంచి 17 సంవత్సరాల పిల్లల జనాభా కనీసం 4.9 కోట్లు పెరుగుతుందని యూఎన్ అంచనా వేసింది. ఇది కూడా స్కూళ్లకు వెళ్లని పిల్లల సంఖ్య పెరగడంపై ప్రభావం చూపిందని యునెస్కో పేర్కొంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు కూడా పిల్లలు స్కూళ్లకు వెళ్లడంపై ప్రభావం చూపుతున్నాయని, ఇది కూడా ఈ లెక్కలపై ప్రభావం చూపుతుందని తెలిపింది. మొత్తమ్మీద స్కూళ్లకు దూరంగా ఉన్న వారిలో 11 శాతం లేదా 7.8 కోట్ల మంది ప్రైమరీ స్కూల్‌కు వెళ్లే చిన్నారులని, మిగిలిన వారిలో 15 శాతం లేదా 6.4 కోట్ల మంది సెకండరీ స్కూల్‌కు వెళ్లే పిల్లలని, మిగతా వారిలో 31 శాతం మంది లేదా 13 కోట్ల మంది సెకండరీ స్కూల్‌కు వెళ్లే యూత్ అని యునెస్కో వెల్లడించింది.






