సాంస్కృతిక వారసత్వ పండుగగా దీపావళి.. గుర్తించిన యునెస్కో

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-10 13:31:26  IST  )

‘ఫెస్టివల్ ఆఫ్‌ లైట్స్’ దీపావళి (Diwali) పండుగకు అత్యంత అరుదైన గౌరవం లభించింది.

సాంస్కృతిక వారసత్వ పండుగగా దీపావళి.. గుర్తించిన యునెస్కో
X

దిశ, వెబ్‌‌డెస్క్: ‘ఫెస్టివల్ ఆఫ్‌ లైట్స్’ దీపావళి (Diwali) పండుగకు అత్యంత అరుదైన గౌరవం లభించింది. తాజాగా, దీపావళిని యునెస్కో (UNESCO) సాంస్కృతిక వారసత్వ పండుగగా జీవన వారసత్వం (A Living Legacy) జాబితాలో చేర్చింది. దీపావళిని ప్రపంచవ్యాప్తంగా సంరక్షించాల్సిన, జరుపుకోవాల్సిన సాంస్కృతిక సంపదగా గుర్తిస్తూ ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇటీవలి కాలంలో భారతదేశ సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా లభించిన అత్యంత ముఖ్యమైన గుర్తింపులలో ఇదొకటిగా నిలిచింది.

కాగా, దీపావళిని సాంస్కృతిక వారసత్వ పండుగగా యునెస్కో గుర్తించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ నిర్ణయం పట్ల ఆశ్చర్యపోయారని అన్నారు. దీపావళి భారతదేశ సంస్కృతి, విలువలు, నాగరికతకు లోతుగా అనుసంధానించబడిన పండుగ అని అన్నారు. ఈ పరిణామం ప్రకాశం, ధర్మాన్ని సూచిస్తుందని.. యునెస్కో గుర్తింపు దేశానికి గర్వకారణమైన క్షణమని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

Next Story