- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maha Kumbh 2025 : మహాకుంభమేళాకు భారీగా బందోబస్తు.. డ్రోన్లు, ఏఐ కెమెరాల ఏర్పాటు
అత్యంత వేడుకగా జరిగే మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం ప్రయాగ్ రాజ్ లో పవిత్రస్నానాలు ఆచరిస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: అత్యంత వేడుకగా జరిగే మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం ప్రయాగ్ రాజ్ లో పవిత్రస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే, ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మహా కుంభమేళా కోసం భారీగా భద్రత ఏర్పాటు చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీసుస్టేషన్‌ను ఏర్పాటుచేశారు. అంతేకాకుండా చిన్నచిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు. తొలిసారిగా నిఘా కోసం 100 మీటర్ల వరకు డైవింగ్ చేయగల అండర్ వాటర్ డ్రోన్లను మోహరించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 120 మీటర్ల ఎత్తుకు చేరుకోగల టెథర్డ్ డ్రోన్‌లను కూడా మోహరించినట్లు వెల్లడించింది. రియల్-టైమ్ పర్యవేక్షణ, ముఖ గుర్తింపు సాంకేతికతను అందించే కృత్రిమ మేధస్సు (AI) సామర్థ్యాలతో కనీసం 2,700 కెమెరాలు ఎంట్రీ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. దీనితో పాటు, 56 మంది సైబర్ వారియర్ల బృందాన్ని నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసింది.
ప్రత్యేక సదుపాయాలు
యాత్రికులకు వసతి కల్పించడానికి అధికారులు 150,000 టెంట్లతో పాటు అదనపు టాయిలెట్లు, పారిశుద్ధ్య సౌకర్యాలను యూపీ అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 4,50,000 కొత్త విద్యుత్ కనెక్షన్‌లను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం అనేక ఎలక్ట్రిక్ బస్సులు, అత్యాధునిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. పండుగ సమయంలో 98 ప్రత్యేక రైళ్లనుభారతీయ రైల్వే ప్రవేశపెట్టింది. దీనితో పాటు, నగరంలో 92 రోడ్ల పునరుద్ధరణ, 30 వంతెనల నిర్మాణాలను చేపట్టారు. మెడికల్ ఎమర్జెన్సీ కోసం తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. కాగా.. 45 రోజులపాటు జరిగే కుంభమేళా కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యటకులు రానున్నారు. మొత్తం 45 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం (UP Govt) అంచనా వేస్తోంది. సోమవారం ఒక్కరోజే 40 లక్షలకు పైగా యాత్రికులు పవిత్ర కర్మ 'షాహి స్నానం' చేస్తారని అధికారులు అంచనావేశారు. అంతేకాకుండా,
విలువలు, సంస్కృతి పెంచే ప్రత్యేకమైన రోజు- మోడీ
కుంభమేళా ప్రారంభంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎంతోమందిని ఒకచోట చేర్చింది. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుంది.’’ అని మోడీ రాసుకొచ్చారు. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే వెల్లడించారు. "సంస్కృతుల సంగమం ఉన్న చోటే విశ్వాసం, సామరస్యం సంగమం ఉంటుంది. 'భిన్నత్వంలో ఏకత్వం' అనే సందేశాన్ని ఇస్తూ కుంభమేళా. సనాతన ధర్మంతో పాటు మానవాళి సంక్షేమాన్ని కోరుకుంటుందని " అని యోగి ఎక్స్ లో రాసుకొచ్చారు.






