- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: నివాస ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఏమందంటే?
పీజీ మెడికల్ కోర్సుల్లో నివాస ఆధారిత కోటాను సుప్రీంకోర్టు (Supreme Court) రద్దు చేసింది. రాష్ట్ర కోటా కింద పీజీ సీట్ల కేటాయింపులో అనుసరిస్తున్న ఈ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: పీజీ మెడికల్ కోర్సుల్లో నివాస ఆధారిత కోటాను సుప్రీంకోర్టు (Supreme Court) రద్దు చేసింది. రాష్ట్ర కోటా కింద పీజీ సీట్ల కేటాయింపులో అనుసరిస్తున్న ఈ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. ‘మనకు ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. దేశంలోని ఏ విద్యా సంస్థలలో ప్రవేశాన్ని ఎంచుకునే హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చింది. మనమంతా భారత భూభాగంలో నివసిస్తున్నాం కాబట్టి ఏ ప్రాంతం, ఏ రాష్ట్ర నివాసం అనే ప్రశ్నే ఉండదు. ఉద్యోగం, వ్యాపారం చేసుకోవడానికి దేశంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉంది. అలాగే చదువుకునే హక్కు కూడా’’ అని ధర్మాసనం వెల్లడించింది. నిర్దిష్ట రాష్ట్రంలో నివసించేవారి విషయంలో రిజర్వేషన్ల గురించి ఆలోచించవచ్చని.. కానీ, అది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల వరకే అని చెప్పుకొచ్చింది. పీజీ కోర్సుల్లో స్థానికత కోటాను ప్రాతిపదికగా తీసుకుంటే.. అది ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే అవుతోందని పేర్కొంది. అయితే ఇప్పటికే జారీ అయిన నివాస ఆధారిత రిజర్వేషన్లకు ఈ తీర్పు వర్తించదని పేర్కొంది.
2019 తీర్పుని సవాల్ చేస్తూ..
కాగా.. పీజీ మెడికల్ కోర్సులకు నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని గతంలో పంజాబ్-హర్యానా కోర్టు 2019లో తీర్పు ఇచ్చింది. దీనిని పలువురు సుప్రీంకోర్టు (Supreme Court)లో సవాల్ చేయగా.. ఇద్దరు సభ్యుల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. అయితే కేసు ప్రాముఖ్యత దృష్ట్యా దానిని ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి సిఫారసు చేసింది. ఈ సమయంలోనే ఆ పిటిషన్ ను కొట్టివేస్తూ ఉన్నతన్యాయస్థానం తీర్పు వెల్లడించింది.






