- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి.. ఆపద్ధర్మ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఆపద్ధర్మ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా (Single Largest Party) అవతరించిన తమిళగ వెట్రి కజగం (TVK), మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీకే (TVK) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని తాము అడ్డుకోబోమని ఆయన స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, గతంలో డీఎంకే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఆయన కోరారు. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించడం ప్రస్తుతం భారమైన విషయమని, గతంలో డీఎంకే ఇచ్చినట్లుగా నెలకు రూ.1,000 ఇవ్వాలని సూచించారు. కొత్త పార్టీ ఏర్పాటును అడ్డుకుని, రాష్ట్రాన్ని మళ్లీ ఎన్నికలకు తీసుకెళ్లే ఉద్దేశం తమకు లేదని స్టాలిన్ తేల్చి చెప్పారు.
మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధత కొనసాగుతున్న వేళ విజయ్ తనకు కేటాయించిన అధికారిక కాన్వాయ్ భద్రతను వెనక్కి పంపారు. సీఎం హోదా అధికారికంగా ఖరారయ్యాకే సెక్యూరిటీ తీసుకుంటానని స్పష్టం. ఇదే సమయంలో అన్నాడీఎంకే (AIADMK) రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. టీవీకేకు మద్దతు ఇచ్చే అంశంపై అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు సి.వి. షణ్ముగం నేతృత్వంలో మొత్తం 27 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని ఒక రిసార్టుకు తరలివెళ్లారు.






