కశ్మీర్‌పై వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావు

by Ajay Maddhiboyina |

జమ్ము కశ్మీర్ ఇండియాలో అంతర్బాగం. దానిపై ఏ దేశానికి లేదా ఇతరులకు ఎవరికీ వ్యాఖ్యానించే అర్హత లేదని తెలిపింది.

కశ్మీర్‌పై వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావు
X

- భారత అంతర్గత విషయాలతో మీకేం పని?

- పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదంపై మాట్లాడరా?

- టర్కీ ప్రెసిడెంట్‌ వ్యాఖ్యలపై భారత్ మండిపాటు

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ పర్యటనలో కశ్మీర్‌పై టర్కీ అధ్యక్షుడు రిసెస్ తైప్ ఎర్దోవాన్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం మండిపడింది. ఇండియా అంతర్గత విషయాలపై మీకు అంత ఆసక్తి ఎందుకని ప్రశ్నించింది. వారం రోజుల క్రితం పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన టర్కీ అధ్యక్షుడు రిసెప్ తైప్ ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా పరిష్కరించాలని చెప్పారు. కాగా, రిసెప్ తైప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు టర్కీ దౌత్య కార్యాలయానికి తమ నిరసన లేఖను అందించింది. అధ్యక్షుడు రిసెస్ తైప్ వ్యాఖ్యలు అసంబద్దమైనవే కాకుండా ఆమోదయోగ్యమైనవి కూడా కావని పేర్కొంది. భారత అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశంపై ఇలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదనిచెప్పింది. ఢిల్లీలోని టర్కిష్ అంబాసిడర్‌కు ఈ అంశంలో బలమైన నిరసనను తెలిపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ శుక్రవారం తెలిపారు. భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కావని ఆ నిరసన నోట్‌లో పేర్కొంది. జమ్ము కశ్మీర్ ఇండియాలో అంతర్బాగం. దానిపై ఏ దేశానికి లేదా ఇతరులకు ఎవరికీ వ్యాఖ్యానించే అర్హత లేదని తెలిపింది.

Next Story