- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారులపై అరగంటకో అఘాయిత్యం.. యూఎన్ మానవహక్కుల కమిషనర్ ఆవేదన
కాంగోలో చిన్నారులపై అరగంటకో అఘాయిత్యం జరుగుతోందని, యుద్ధం పేరుతో జరిగే ఈ ఘోరాలు ఆపాలని యూఎన్ మానవహక్కుల కమిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: యుద్ధం పేరుతో చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషనర్ వోల్కర్ టర్క్ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభంలో ఉన్న డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ)లో అధికారిక లెక్కల ప్రకారం చిన్నారులపై అత్యాచారాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, ప్రతి అరగంటకు ఒక చిన్నారిపై అత్యాచారం జరుగుతోందని వోల్కర్ టర్క్ వెల్లడించారు. చాలా ప్రాంతాల్లో లైంగిక దాడులు కూడా యుద్ధతంత్రాల్లో భాగంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. హింస, ఘోరాలు, అస్థిరత్వం, నివాస ప్రాంతాలు కోల్పోవడం వంటి సమస్యలు తీరాలంటే రక్షణ, న్యాయం, శాంతి కోసం అందరూ పాటుపడాలని కోరారు. ఈ మేరకు ‘ఎండ్ రేప్ ఇన్ వార్’ అనే ట్యాగ్‌తో తన ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు.
A child raped every 30min—this was the tragic reality in eastern #DRC earlier this year.
— Volker Türk (@volker_turk) June 19, 2025
In many conflict zones, sexual violence is a weapon of war.
We must invest in protection, justice & peace to stop cycles of violence, atrocities, displacement & instability.#EndRapeInWar pic.twitter.com/tgLrlFgA4s






