- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే.. అమెరికా చర్యలపై యూఎన్
వెనిజులాపై అమెరికా సైనిక చర్య తీవ్ర ఆందోళనకరమని యూఎస్ చెప్పింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారని చెప్పింది.

దిశ, నేషనల్ బ్యూరో: వెనిజులాపై అమెరికా సైనిక చర్యపై యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్పందించారు. అంతర్జాతీయ చట్టాలను ఏమాత్రం గౌరవించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం నాడు జరిగిన యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో మాట్లాడిన ఆయన.. అంతర్జాతీయ శాంతి, భద్రతను కాపాడేందుకు ఇంటర్నేషనల్ చట్లాలు మార్గం చూపుతాయని, వాటిని యూఎస్ బేఖాతరు చేసిందని అన్నారు. అసలే అనిశ్చితిలో ఉన్న వెనిజులాను యూఎస్ చర్య మరింత గందరగోళంలోకి నెట్టేస్తుందన్నారు. దశాబ్దాలుగా సామాజిక, ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశ ప్రజలు.. స్వదేశం నుంచి పారిపోతూ వచ్చారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యం ఇలా మంటగలిసి, పరిస్థితి దారుణంగా ఉన్నా కూడా మరింత వినాశనం కాకుండా పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉంటుందని గుటెరస్ చెప్పారు. ఇలాంటి అయోమయ, సంక్లిష్ట పరిస్థితుల్లోనే మరింత కఠినంగా నియమనిబంధనలు పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అక్రమ డ్రగ్స్ రవాణా, వనరులు-మానవ హక్కుల ఆందోళనలు వంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో అంతర్జాతీయ చట్టాలు స్పష్టంగా చెప్తాయని, ఆ మార్గంలోనే అందరూ నడవాలని సూచించారు.






