UN Aids: 2029 నాటికి 40లక్షలకు పైగా ఎయిడ్స్‌ మరణాలు..కారణమిదే?

by B.Srinivas |

అంతర్జాతీయంగా ఎయిడ్స్ నియంత్రణా కార్యక్రమాలకు పాల్పడే యూఎన్ ఎయిడ్స్ కు అమెరికా నిధులు ఆపేసిన విషయం తెలిసిందే.

UN Aids: 2029 నాటికి 40లక్షలకు పైగా ఎయిడ్స్‌ మరణాలు..కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయంగా ఎయిడ్స్ నియంత్రణా కార్యక్రమాలకు పాల్పడే ఐక్యరాజ్యసమితికి చెందిన యూఎన్ ఎయిడ్స్ (UN Aids)కు నిధులు ఆపేసిన విషయం తెలిసిందే. దీంతో ఎయిడ్స్ అవగాహనా ప్రోగ్రామ్స్‌కు బ్రేక్ పడింది. అయితే యూఎస్ తీసుకున్న ఈ డిసిషన్‌ను పున:పరిశీలించకపోతే 2029 నాటికి 40లక్షలకు పైగా ఎయిడ్స్‌ మరణాలు సంభవించే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాక నాలుగేళ్లలో 60 లక్షల మంది హెచ్ఐవీ బారిన పడొచ్చని హెచ్చరించింది. ఈ మేరకు యూఎన్ ఎయిడ్స్ గురువారం ఓ నివేదిక విడుదల చేసింది.

‘ప్రస్తుతం నిధుల కొరత కారణంగా ఎయిడ్స్ రోగులకు అందించే చికిత్సకు ఇబ్బంది కలుగుతోంది. వేలాది క్లినిక్‌లలో సిబ్బంది తగ్గిపోయారు. తద్వారా ఎయిడ్స్ నివారణ కార్యక్రమాలకు ఆటంకం కలిగించింది. హెచ్ఐవీ పరీక్షలు సైతం జరగడం లేదు. అనేక కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ తమ హెచ్ఐవీ బాధితులకు అందించే సేవలను తగ్గించాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం’ అని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా దశాబ్దాలుగా సాగుతున్న పురోగతిని దెబ్బతీస్తూ, ఇతర ప్రధాన దాతలు కూడా తమ మద్దతును తగ్గించుకుంటారని తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6.30 లక్షల ఎయిడ్స్ సంబంధిత మరణాలు సంభవించాయని యూఎన్ ఎయిడ్స్ తెలిపింది. కాగా, యూఎన్ ఎయిడ్స్‌కు అత్యధిక నిధులు అందజేసే దేశంగా అమెరికా ఉంది.

Next Story