- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ukraine : ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను పట్టుకున్నాం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
రష్యా సైనికులతో కలిసి పోరాడుతున్న ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను తమ బలగాలు సజీవంగా పట్టుకున్నాయని జెలెన్ స్కీవెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాలోని కుర్స్క్ సరిహద్దు ప్రాంతంలో రష్యా సైనికులతో కలిసి పోరాడుతున్న ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను తమ బలగాలు సజీవంగా పట్టుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) వెల్లడించారు. వీరిద్దరూ స్వల్పంగా గాయపడ్డారని వారిని కీవ్‌కు తీసుకొచ్చామని తెలిపారు. యుద్ధ ఖైదీలందరిలానే వారు అవసరమైన వైద్య సహాయాన్ని పొందుతున్నారని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ భద్రతా సేవతో వారు కమ్యునికేట్ చేస్తు్న్నారని వెల్లడించారు. వారితో మాట్లాడటానికి జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ మేరకు సైనికులిద్దరి ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సైనికులను సజీవంగా పట్టుకోవడం సులభమైన విషయం కాదని నొక్కి చెప్పారు.
ఉక్రెయిన్ భద్రతా సేన సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఒకరి వద్ద ఎలాంటి పత్రాలు లేవని, మరొకరి వద్ద మంగోలియా సరిహద్దులో ఉన్న రష్యా ప్రాంతం తువా పేరుతో రష్యా సైనిక గుర్తింపు కార్డు ఉందని తెలిపింది. ఖైదీలు ఉక్రేనియన్, ఇంగ్లీష్, రష్యన్ మాట్లాడరు కాబట్టి వారితో కొరియన్ అనువాదకుల ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుందని పేర్కొంది. జెనీవా ఒప్పందాల ప్రకారం ఇద్దరు సైనికులకు వైద్య సహాయం అందించామని, దక్షిణ కొరియా గూఢచార సేవల సహకారంతో వారిని విచారిస్తున్నామని వెల్లడించింది. అయితే దీనిపై రష్యా, సౌత్ కొరియాలు స్పందించలేదు.






