రష్యా న్యూక్లియర్ ప్లాంట్ పై ఉక్రెయిన్ అటాక్

by Muthe.Rajitha |   (  Updated:2025-08-24 17:44:07  IST  )

రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine War) మధ్య యుద్ధం మరోసారి భగ్గుమన్నది.

రష్యా న్యూక్లియర్ ప్లాంట్ పై ఉక్రెయిన్ అటాక్
X

దిశ, వెబ్ డెస్క్ : రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine War) మధ్య యుద్ధం మరోసారి భగ్గుమన్నది. గత కొన్ని రోజులుగా చర్చలకు సిద్ధమని ఇరు దేశాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు శాంతి చర్చలకు సిద్ధం అంటూనే మరోవైపు పరస్పరం దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా తమ దేశపు స్వాతంత్య్రపు దినోత్సవం రోజునే ఉక్రెయిన్ రష్యాలోని భారీ న్యూక్లియర్ కేంద్రంపై దాడి చేసింది. దీంతో ఫ్యూయెల్ టర్మినల్స్ నుంచి మంటలు ఎగసి పడుతున్నాయి.

అయితే ఈ ఘటనపై రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ శాఖ స్పందిస్తూ.. రేడియేషన్ లెవెల్ నార్మల్ గానే ఉందని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెబుతోంది. మరోవైపు 95 ఉక్రెయిన్ డ్రోన్స్ కూల్చివేసినట్టు కూడా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో అంతర్జాతీయ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story