- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ukraine: 24 గంటల్లో 1400 మంది ఉక్రెయిన్ సైనికులు హతం.. రష్యా కీలక ప్రకటన
యుద్ధంలో భాగంగా గత 24 గంటల్లో తమ దళాలు 1400 ఉక్రెయిన్ సైనికులను మట్టుబెట్టాయని రష్యా ప్రకటించింది.

దిశ, నేషనల్ బ్యూరో: యుద్ధంలో భాగంగా గత 24 గంటల్లో తమ దళాలు 1400 ఉక్రెయిన్ సైనికులను మట్టుబెట్టాయని రష్యా (Russia) ప్రకటించింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరు దేశాలు ఒకరిపై ఒకరు అతిపెద్ద డ్రోన్ దాడులు ప్రారంభించడం, తుర్కియేలోని ఇస్తాంబుల్ (Isthamble) లో శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రష్యా ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇదే టైంలో 1100 మంది రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ తెలిపింది. రష్యా దాడిలో 7 మంది ఉక్రేనియన్ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది.
మూడేళ్ల యుద్ధంలో ఇప్పటి వరకు రష్యన్ సైన్యం 9,90,800 మంది సైనికులను కోల్పోయినట్టు ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తాజాగా విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. ‘యుద్ధంలో ఇప్పటివరకు రష్యా 10,881 ట్యాంకులు, 22,671 సాయుధ వాహనాలు, 50,607 వాహనాలు, ఇంధన ట్యాంకులు, 28,623 ఫిరంగి సిస్టమ్స్, 1,402 రాకెట్ లాంచర్లు, 1,176 వైమానిక రక్షణ వ్యవస్థలు, 384 విమానాలు, 336 హెలికాప్టర్లు, 38,748 డ్రోన్లు, 28 నౌకలు. ఒక జలాంతర్గామిని కోల్పోయిందని’ తెలిపారు. కాగా, రెండు దేశాలు ప్రస్తుతం ఇస్తాంబుల్‌లో కాల్పుల విరమణ కోసం చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండు దేశాలు ఖైదీల మార్పిడిపై ఒప్పందం కుదుర్చుకున్నాయి.






