విమానం టికెట్ రీఫండ్ కోసం.. చనిపోయాడు!

by Phanindra |

విమానం టికెట్ రీఫండ్ కోసం.. చనిపోయాడు! ఈ యూట్యూబర్ చేసిన మోసం తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది.

విమానం టికెట్ రీఫండ్ కోసం.. చనిపోయాడు!
X

దిశ, నేషనల్ బ్యూరో: తన విమానం టికెట్ రీఫండ్ కోసం యూకేకు చెందిన ఒక వ్యక్తి చనిపోయాడు. కాకపోతే అది నిజంగా కాదు. యూకేకు చెందిన మాక్సిమిలన్ ఆర్థర్ పాష్ అనే యూట్యూబర్ తన అనుభవాన్ని తాజాగా ఆన్‌లైన్‌లో పంచుకున్నాడు. ‘రెండు నెలల క్రితం నేను ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా. కానీ చివరకు ఆ ప్రయాణానికి వెళ్లలేదు. రీఫండ్ కోసం దరఖాస్తు చేస్తుంటే ఒక చిన్న లీగల్ క్లాజ్ కనిపించింది. ఆ లూప్‌హోల్ కోసం టెక్నికల్‌గా చచ్చిపోయా’ అని ఆర్థర్ వెల్లడించాడు.

ఇటలీలో ఉన్న ఒక మైక్రోనేషన్ ప్రిన్సిపాలిటీ ఆఫ్ సెబోర్గాకు వెళ్లి, అక్కడి యువరాణి నైనా మెనెగాటోను కలిశాడు. అక్కడి నుంచే ఒక డెత్ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. దాన్ని ఎయిర్‌లైన్స్‌కు సబ్‌మిట్ చేసినప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడే తన లాయర్ ఇలా చేయొద్దని హెచ్చరించాడట. అయితే ఇలా విమానం టికెట్ డబ్బుల కోసం ఒక సిటీ స్టేట్‌తో కలిసి మోసం చేయడం 1850ల దశకంలోని పెద్ద మోసంలా అనిపించిందని చెప్పాడు.

‘ఎయిర్‌లైన్స్ మనం చనిపోయి ఉండాలని అడగడం లేదు. జస్ట్ డెత్ సర్టిఫికెట్ మాత్రమే అడుగుతోంది. నేను లీగల్‌గా డెత్ సర్టిఫికెట్ తెచ్చుకుంటే అది ఫ్రాడ్ అవ్వదు కదా. ఇలాంటి విషయాల్లో ఎయిర్‌లైన్సే చాలా స్పష్టంగా ఉండాలి’ అని వివరించాడు.

Next Story