- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోయింగ్ ఇంధన స్విచ్‌లపై ముందే హెచ్చరించిన యూకే!
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తు నివేదిక తేల్చింది. దీంతో ఇంధన స్విచ్‌లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో యూకేకు చెందిన పౌర విమానయాన అథారిటీ (CAA) కీలక ప్రకటన చేసింది. బోయింగ్ (Boeing) 787 డ్రిమ్‌లైనర్ విమానాల్లోని ఐదు ఇంజిన్లలో ఇంధన షటాఫ్ వాల్వ్ యాక్టువేటర్లలో ఖచ్చితత్వంలో లోపాలు ఉన్నట్లు హెచ్చరించింది.
ఇందుకు సంబంధించి మే 15న కీలక భద్రతా నోటిసు జారీ చేసినట్లు పేర్కొంది. అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నిర్వహించిన ఎయిర్‌వర్తినెస్ డైరెక్టివ్ (ADలో ఆయా విమానాల్లో ఇంజిన్ ఇంధన షటాఫ్ వాల్వ్ యాక్టువేటర్స్ గురించి హెచ్చరికలు చేసిందని పేర్కొంది. ఈ డిఫెక్ట్ వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఇంజిన్‌ను ఆపలేని ప్రమాదం ఉందని స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆయా విమానాల ఇంధన షట్ ఆఫ్ వాల్వ్‌లకు రోజువారీ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే, ఈ నోటీసు పట్ల అప్పట్లో పెద్దగా స్పందన లేకపోయినప్పటికీ, తాజా ఘటన దీని సీరియస్‌నెస్ ఏంటో తిరిగి గుర్తుచేస్తోంది. విమానయాన సంస్థలు తక్షణం ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుని అన్ని సంబంధిత భాగాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది.






