- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mega Diplomatic Outreach: ఏయే బృందాలు.. ఏయే దేశాలకు వెళ్తాయంటే..!
పాకిస్థాన్ ఉగ్రకుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు అఖిల పక్షబృందాలను ఏర్పాటు చేసింది. అయితే, ఆ ప్రతినిధుల బృందాలకు ఏడుగురు ఎంపీలు నాయకత్వం వహిస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ ఉగ్రకుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు అఖిల పక్షబృందాలను ఏర్పాటు చేసింది. అయితే, ఆ ప్రతినిధుల బృందాలకు ఏడుగురు ఎంపీలు నాయకత్వం వహిస్తున్నారు. దేశం తరఫున జాతీయ ఏకాభిప్రాయాన్ని ప్రపంచికి చాటడమే ఉద్దేశంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని దేశాలకూ ఈ బృందాలు వెళ్లనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ), సంజయ్‌కుమార్ ఝా (జేడీ-యూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలె (ఎన్సీపీ-ఎస్పీ), శ్రీకాంత్ షిండే(శివసేన)లు ఈ బృందాలకు నేతృత్వం వహిస్తారు. అయితే, ఏయే బృందాలు.. ఏయే దేశాలకు వెళ్తాయనే జాబితాను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
ఏఏ దేశానికి ఎవరెవరు వెళ్లనున్నారంటే?
రవిశంకర్ ప్రసాద్ బృందం యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్ దేశాల్లో పర్యటించనుంది. సంజయ్‌కుమార్ ఝా బృందం ఇండోనేసియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్ దేశాలకు వెళ్లగా.. శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని బృందం యూఏఈ, లైబీరియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్ ప్రాంతాల్లో పర్యటించనుంది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ బృందం యూఎస్, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా దేశాల్లో పర్యటించనుంది. ఇకపోతే, డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని బృందం స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యా దేశాల్లో పర్యటించనుంది. సుప్రియా సూలె బృందం ఈజిప్ట్, ఖతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా దేశాలకు వెళ్లనుంది. మరోవైపు, ఏప్రిల్ 22న పహెల్గాంలో ముష్కరులు టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడి (Pahalgam Terror attack)లో 26 మంది అమాయకులు చనిపోయారు. ఇందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అప్పట్నుంచి భారత్- పాక్ మధ్య ఉద్రిక్తలు పెరిగాయి.






