- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
globalisation: ప్రపంచీకరణ ముగిసిపోయింది.. త్వరలోనే ప్రకటన
ప్రపంచీకరణ ముగిసిపోయిందని బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్ ప్రకటించనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచీకరణ ముగిసిపోయిందని బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్ ప్రకటించనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ‘1991లో సోవియట్ యూనియన్ పతనంతో ప్రారంభమైన ప్రపంచీకరణ (globalisation) ఇక్కడితో ముగిసిపోయింది’ అని బ్రిటన్ ప్రధాని సోమవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక జాతీయవాదం విషయంలో అమెరికా తీసుకుంటున్న చర్యలను స్టార్మర్ అంగీకరించినట్లు టైమ్స్ నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త యుగం ప్రారంభమయ్యిందని.. ట్రంప్ విధానాన్ని అందులోని వారు సమర్థిస్తున్నట్లు స్మార్టర్ గుర్తించారంది. గ్లోబలైజేషన్ చాలా మంది శ్రామికులకు అనుకూలంగా ఉండదన్నట్లు తెలిపింది. అయితే, వాణిజ్య యుద్ధాలు మాత్రం దానికి సమాధామని ఆయన నమ్మట్లేదని నివేదికలో వెల్లడించింది.
ట్రంప్ పై వ్యాఖ్యలు
ఇకపోతే, ఇటీవలే ట్రంప్ వివాధాలపై కీవ్ స్మార్టర్ వ్యాఖఅయానించారు. వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి ట్రంప్ తీసుకుంటున్న చర్యల వల్ల పోటీ పెరుగుతోందన్నారు. దానికి అనుగుణంగా ప్రపంచ దేశాలు తమ ఉత్పాదకతను పెంచడానికి కృషి చేస్తాయన్నారు. గత నెల హాంకాంగ్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులో హెచ్‌ఎస్‌బీసీ (HSBC) చీఫ్ సర్ మార్క్ టక్కర్ అమెరికా అనుసరిస్తున్న పన్నుల విధానంపై ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు, ట్రంప్ వాణిజ్య విధానాలతో అంతర్జాతీయ సమాజం మొత్తం చిన్న ప్రాంతీయ బ్లాక్‌లు, క్లస్టర్లుగా విడిపోయే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్తులో వాటి మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు నెలకొనే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో స్టార్మర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏప్రిల్ 2న జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ ట్రంప్.. అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే దేశాలపై "పరస్పర" సుంకాలను ప్రకటించారు. సుంకాల నుండి మినహాయింపులు కోరే వారికి ట్రంప్ సూచనలు చేశారు. 'మీ సొంత సుంకాలను రద్దు చేసుకోండి, మీ అడ్డంకులను తొలగించుకోండి'" అని అన్నారు.






