- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త ఆధార్ యాప్.. mAadhaarకు దీనికి తేడా ఏంటి?
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)కొత్త ఆధార్ యాప్ ను లాంచ్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)కొత్త ఆధార్ యాప్ ను లాంచ్ చేసింది. దేశ పౌరులు తమ ఆధార్ వివరాలను డిజిటల్ గా సేవ్ చేసుకోవడం, సులువుగా అవసరమైన వివరాలను పంచుకునేందుకు ఈ యాప్ ను తెచ్చింది. ఈ మేరకు UIDAI ఎక్స్ లో ఒక ప్రకటన చేసింది.
mAadhaar పేరుతో ఇప్పటికే ఒక యాప్ అందుబాటులో ఉండగా.. దానికి అదనంగా ఈ కొత్త యాప్ ను తీసుకొచ్చింది ఉడాయ్. కానీ.. mAadhaarలో ఉన్నట్లుగా ఇందులో డిజిటల్ కార్డు డౌన్లోడ్, పీవీసీ కార్డు కోసం ఆర్డర్ చేయడం, ఈ-మెయిల్, మొబైల్ నంబర్ వెరిఫికేషన్, వర్చువల్ ఐడీ జనరేషన్ వంటి ఫీచర్లేవీ అందుబాటులో ఉండవు. మరి ఈ కొత్త యాప్ వల్ల ఉపయోగం ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి?
ఆధార్ కార్డును వెంటే తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్ గా ఉంచుకోవడంతో పాటు.. ఫ్యామిలీలో అందరి ఆధార్ కార్డుల వివరాలను ఈ యాప్ లోనే సేవ్ చేసుకోవచ్చు. ఫేస్ అథెంటికేషన్ తో పాటు ఆధార్ లో ఏయే వివరాలను పంచుకోవాలని అనుకుంటున్నారో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. చివరిగా మీరు మీ ఆధార్ ను ఎక్కడ వాడారో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు.






