దేశంలో 22 ఫేక్ వర్సిటీలు.. చెక్ చేసుకోకపోతే డిగ్రీలు దేనికీ పనికిరావు!

by Phanindra |   (  Updated:2025-10-26 18:27:42  IST  )

దేశంలో 22 ఫేక్ వర్సిటీలు ఉన్నట్లు యూజీసీ వెల్లడించింది. వీటిలో చేరే ముందు చెక్ చేసుకోకపోతే డిగ్రీలు దేనికీ పనికిరావని హెచ్చరించింది.

దేశంలో 22 ఫేక్ వర్సిటీలు.. చెక్ చేసుకోకపోతే డిగ్రీలు దేనికీ పనికిరావు!
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ్యాప్తంగా సుమారు 22 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) డేటా చెప్తోంది. తాజాగా ఢిల్లీలోని ముబారక్‌పూర్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ అనుమతులు లేని డిగ్రీ కోర్సులు అందిస్తోందని యూజీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఈ సంస్థ నుంచి తీసుకునే డిగ్రీలకు ఎలాంటి విలువ ఉండదని తేల్చిచెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏ చట్టం కింద ఈ యూనివర్సిటీని ప్రారంభించలేదని యూజీసీ తెలిపింది. ఇలా దేశవ్యాప్తంగా 22 నకిలీ వర్సిటీలున్నాయని యూజీసీ గణాంకాలు చెప్తున్నాయి. వీటిలో ఏకంగా 10 యూనివర్సిటీలో దేశరాజధాని ఢిల్లీలోనే ఉండటం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో నాలుగుండగా.. కేరళ (2), పశ్చిమబెంగాల్ (2), మహారాష్ట్ర (1), ఆంధ్రప్రదేశ్ (2), పుదుచ్చేరి (1)లో మిగతావి ఉన్నట్లు తెలుస్తోంది.

బ్రోకర్ నెట్‌వర్క్‌లతో విద్యార్థులను మాయచేసి ఈ వర్సిటీల్లో అడ్మిషన్లు పెంచుకుంటున్నట్లు సమాచారం. దీనికి అనుగుణంగా ఉండటం కోసం సంస్థలకు పేర్లు పెట్టే సమయంలో ‘నేషనల్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఇన్‌స్టిట్యూట్’ వంటి పదాలుండేలా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైనా విద్యాసంస్థలో చేరేటప్పుడు అవి సెక్షన్ 2(ఎఫ్) లేదా 3 కింద యూజీసీ గుర్తించిన జాబితాలో ఉన్నాయో, లేదో చూసుకోవాలని అధికారులు సూచించారు. ఇక కోర్సుల విషయంలో కూడా ఏఐసీటీఈ, పీసీఐ, ఎన్ఎంసీ వంటి కౌన్సిళ్ల నుంచి ఏ కోర్సులకు అనుమతులు లభించాలయో చూడా పరిశీలించాలని చెప్పారు.

Next Story