వాట్సాప్ గ్రూపుల్లో వేధించినా ర్యాగింగ్ చేసినట్టే..యూజీసీ కీలక ఆదేశాలు

by Ajay Maddhiboyina |

విద్యా సంస్థ‌ల‌కు యూజీసీ (యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్) కీల‌క ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్ గ్రూపుల్లో వేధించినా ర్యాగింగ్ చేసిన‌ట్టేన‌ని స్ప‌ష్టం చేసింది.

వాట్సాప్ గ్రూపుల్లో వేధించినా ర్యాగింగ్ చేసినట్టే..యూజీసీ కీలక ఆదేశాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: విద్యా సంస్థ‌ల‌కు యూజీసీ (యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్) కీల‌క ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్ గ్రూపుల్లో వేధించినా ర్యాగింగ్ చేసిన‌ట్టేన‌ని స్ప‌ష్టం చేసింది. విద్యా సంస్థ‌ల్లో కొత్త‌గా చేరే విద్యార్థుల‌ను వాట్సాప్ గ్రూపుల్లో కించ‌ప‌రిచే విధంగా మాట్లాడినా అది ర్యాగింగ్ గానే ప‌రిగ‌ణించాల‌ని విద్యాసంస్థ‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది. అలా ర్యాగింగ్ చేసిన వారిపై ర్యాగింగ్ నిరోధ‌క నిబంధ‌న‌ల ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యాసంస్థ‌ల‌కు సూచించింది.

సీనియ‌ర్లు కొన్నిసార్లు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి అందులో జూనియ‌ర్ల‌ను వేధిస్తున్నార‌ని, ఇది కూడా ర్యాగింగ్ తో స‌మాన‌మ‌ని యూజీసీ భావించింది. జూనియ‌ర్ల‌ను వేధించ‌డానికి క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపుల‌పై నిఘా ఉంచాల‌ని ఉన్న‌త విద్యాసంస్థ‌ల‌కు ఆదేశించింది. సీనియ‌ర్లు వాట్సాప్ గ్రూపుల్లో వేధింపులకు గురి చేస్తున్నారంటూ డజన్ల కొద్ది ఫిర్యాదులు వస్తున్న రావడంతో యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. క్యాంపస్‌లో విద్యార్థుల భద్రత అత్యంత ముఖ్యమైందని యూజీసీ అభిప్రాయపడింది. ర్యాగింగ్ నిబంధనలు అమలు చేయడంలో విఫలం అయితే గ్రాంట్లను నిలిపివేయడం లాంటి కఠినచర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది.

Next Story