- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కోర్సుల్లో అడ్మిషన్లు ఆపేయాలని యూనివర్సిటీలకు ఆదేశాలు!
ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పలు కోర్సుల్లో ఆన్‌లైన్, డిస్టెన్స్ అడ్మిషన్లు ఆపేయాలని యూజీసీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉన్నత విద్యా సంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన కోర్సులను ఓపెన్, ఆన్‌లైన్ లేదా డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో బోధించడాన్ని తక్షణమే నిలిపివేయాలని సూచించింది. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ యాక్ట్, 2021 పరిధిలోకి వచ్చే కోర్సులకు ఈ నిషేధం వర్తిస్తుందని యూజీసీ స్పష్టం చేసింది.
జులై-ఆగస్టు 2025 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు ఇవ్వొద్దని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయో టెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్, డైటెటిక్స్ వంటి ఆరోగ్య సంరక్షణ కోర్సులన్నింటినీ ఈ నిషేధం పరిధిలోకి తీసుకొచ్చింది. జులై 23న జరిగిన యూజీసీ సమావేశంలో 24వ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వర్కింగ్ గ్రూప్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ తెలిపింది.






