- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Uddhav Thackeray: మరోసారి ఉద్ధవ్, రాజ్ ఠాక్రే బేటీ.. అందుకోసమేనా!
శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మధ్య భేటీ సంచలనం(Reunion Buzz) సృష్టించింది.

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మధ్య భేటీ సంచలనం(Reunion Buzz) సృష్టించింది. కజిన్స్ అయిన వీరిద్దరూ ఓ వివాహవేడుకలో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఆదివారం ముంబైలోని అంధేరీలో జరిగిన ప్రభుత్వ అధికారి మహేంద్ర కళ్యాణ్కర్ కుమారుడి వివాహానికి వారిద్దరూ హాజరయ్యారు. ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మితో రాజ్ ఠాక్రే భేటీ అయ్యారు. అక్కడ వారిద్దరూ కొద్దిసేపు చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకున్నారు. పెళ్లి వేడుకల్లో వీరిద్దరూ కలిసి మాట్లాడుకోవడం ఇది మూడోసారి. అయితే, మహారాష్ట్రలోని అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) కూటముల్లో విభేదాలు తలెత్తుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా.. త్వరలోనే మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో వీరిద్దరి భేటీ సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ), ఎంఎన్‌ఎస్ తమ విభేదాలను పరిష్కరించుకునేందుకు నిర్ణయించుకున్నాయని పేర్కొన్నారు.రాజకీయంగా విడిపోయిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే త్వరలోనే తిరిగి కలుస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
శివసేన నుంచి విడపోయిన రాజ్ ఠాక్రే
మరోవైపు, 2005లో శివసేన నుంచి రాజ్ ఠాక్రే బయటకు వచ్చారు. ఆ తర్వాత ఏడాది తర్వాత రాజ్ ఠాక్రే సొంత పార్టీ ఎంఎస్ఎస్ ను ఏర్పాటు చేశారు. ఇకపోతే, గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష ఎంవీఏలో భాగమైన శివసేన (యూబీటీ) 20 సీట్లు గెలుచుకున్నది. అయితే ఎంఎన్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అంతేకాకుండా, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన రాజ్ ఠాక్రే కుమారుడు కూడా ఓడిపోయాడు. ఇలాంటి, సమయంలో వీరిద్దరు భేటీ అవడంతో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయవచ్చని తెలుస్తున్నది.






