- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబైని తాకట్టు పెట్టాలని చూస్తున్నారు.. బీజేపీపై ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ముంబాయిని తాకట్టుపెట్టాలని బీజేేపీ ప్రయత్నిస్తోందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో జరిగిన అవకతవకల వల్లనే బీజేపీ గెలిచిందని ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: ముంబాయిని తాకట్టుపెట్టాలని బీజేేపీ ప్రయత్నిస్తోందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో జరిగిన అవకతవకల వల్లనే బీజేపీ గెలిచిందని ఆరోపించారు. అది కుట్రపూరితంగా, అక్రమంగా దక్కిన విజయం అని వ్యాఖ్యానించారు. ఈ ఒక్క గెలుపుతో తమను నిర్వీర్యం చేశామని బీజేపీ భావిస్తోందని అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. యుద్ధం ముగియలేదని ఇప్పుడే మొదలైందని వ్యాఖ్యానించారు. బీజేపీ కుట్రలను త్వరలోనే బయటపెడతాని అన్నారు. శివసేన ఎన్నికల్లో 64 స్థానాలు కైవసం చేసుకుందని ముంబాయిలో తమ పార్టీ మేయర్ ను నియమించాలనేదని తన కల అని చెప్పారు. అది జరగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే ముంబాయిలో మొత్తం 227 స్థానాలు ఉండగా అధికారం దక్కించుకోవాలంటే 114 సీట్లు రావాలి. అయితే బీజేపీ, శివసేన షిండే కూటమి అంతకంటే ఎక్కువ సీట్లను సాధించింది.






