Udayanidhi: ఎట్టిపరిస్థితుల్లోనూ హిందీని అనుమతించం.. ఉదయనిధి స్టాలిన్

by B.Srinivas |

బలవంతంగా హిందీని రుద్దాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తమిళనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.

Udayanidhi: ఎట్టిపరిస్థితుల్లోనూ హిందీని అనుమతించం.. ఉదయనిధి స్టాలిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ విద్యా విధానం (NEP) ముసుగులో బలవంతంగా హిందీని రుద్దాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తమిళనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi stalin) స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం హిందీని ఇంపోజ్ చేయాలని ప్రయత్నిస్తే మరో భాషా యుద్ధం తప్పదని హెచ్చరించారు. హిందీ వల్ల అనేక ఉత్తర భారత మాతృభాషలు తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి డీఎంకే భయపడబోదని తేల్చి చెప్పారు. డీలిమిటేషన్, ఎన్ఈపీ, హిందీ భాషను అనుమతించబోమన్నారు.

‘కేంద్రం తమిళనాడుపై హిందీని రుద్దాలని యోచిస్తోంది. హర్యానా, బిహార్, యూపీ రాష్ట్రాల్లో హిందీని రుద్దడం వల్ల వాటి మాతృభాషలు కనుమరుగయ్యాయి’ అని తెలిపారు. ‘ఇటీవల సీఎం స్టాలిన్ మూడు విషయాలు చెప్పారు. మేము ఎన్ఈపీ, డీలిమిటేషన్‌, త్రిభాషా విధానాన్ని అంగీకరించబోము. కేంద్రం హిందీ భాషను విధించడానికి ప్రయత్నిస్తోంది. కొత్త విద్యా విధానం ద్వారా ఈ కుట్రక తెరలేపింది. తమిళనాడు కొత్త విద్యా విధానాన్ని ఎప్పుడూ అంగీకరించదు. కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రస్తుత పాలన ఏఐఏడీఎంకేది కాదు. డీఎంకేది అని తెలిపారు.

Next Story