- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UK MPs: ఇజ్రాయెల్ లో ఇద్దరు బ్రిటన్ ఎంపీల నిర్బంధం
ఇజ్రాయెల్ (Israel)కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ (UK) ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించారు. కాగా.. ఈ చర్యను యూకే తీవ్రంగా పరిగణించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ (Israel)కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ (UK) ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించారు. కాగా.. ఈ చర్యను యూకే తీవ్రంగా పరిగణించింది. ఇద్దరు యూకే అధికారులని అదుపులోకి తీసుకోవడం ఆమోదయోగ్యం కాదని.. ఇది ఆందోళన కలిగిస్తోందని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ (David Lammy) అన్నారు. లామీ స్పందిస్తూ.. ‘ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన యూకే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలోని ఇద్దరు ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వారి చర్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మా ఎంపీలతో ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. ఇదే విషయాన్ని అక్కడి ప్రభుత్వంలోని నా సహచరులకు స్పష్టం చేశా. ఇజ్రాయెల్ - హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ, గాజాలో శాంతి నెలకొల్పడం వంటి అంశాలకు సంబంధించిన చర్చలపైనే మా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది’ అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే?
అధికార లేబర్ పార్టీకి చెందిన యువాన్ యాంగ్ (Yuan Yang) ఎర్లీ, వుడ్డీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అబ్తిసామ్ మొహమ్మద్ (Abtisam Mohamed) షెఫీల్డ్ సెంట్రల్‌కు ఎంపీగా ఉన్నారు. వీరిద్దరూ శనివారం లుటాన్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్లారు. కాగా.. వారిని అధికారులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కొంత సమయం తర్వాత విడిచిపెట్టారు. తమ భద్రతా దళాల కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయడంతో పాటు తమపై వ్యతిరేకతను పెంచేందుకు ఆ ఎంపీలు వచ్చారని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే వారి రాకను అడ్డుకున్నట్లు తెలిపారు. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది. ఈ దాడిలో 1,218 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది పౌరులు ఉన్నారని ఇజ్రాయెల్ అంటోంది. కాగా.. ఇటీవలే ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. గత నెలలో ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులకో పాల్పడుతోంది. అప్పట్నుంచి 1,249 మంది మరణించారని, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మొత్తం మరణాల సంఖ్య 50,609కి చేరుకుందని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది.






