TVK Stampede: తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. టీవీకే పార్టీ నిర్వాహకులు ఇద్దరు అరెస్ట్

by Ramesh Naini |

తమిళనాడు తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు బాధ్యులుగా ఇద్దరు తమిళగ వెట్రి కళగం పార్టీ నిర్వాహకులు అరెస్ట్ అయ్యారు.

TVK Stampede: తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. టీవీకే పార్టీ నిర్వాహకులు ఇద్దరు అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు (stampede) తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు బాధ్యులుగా ఇద్దరు తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ నిర్వాహకులు అరెస్ట్ అయ్యారు. కరూర్ ప్రాంతంలో పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ నిర్వహించిన సభలో 41కి మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో మంగళవారం టీవీకే కరూర్ వెస్ట్ జిల్లా కార్యదర్శి వీపీ మతియఝగన్, పట్టణ కోఆర్డినేటర్ పవన్ రాజ్‌లను కరూర్ మేజిస్ట్రటే్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ఈ కేసులో ఏ1 గా ఉన్నా మతియఝగన్ సోమవారం కరూర్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. హీరో విజయే తొక్కిసలాటకు కారణమని, అతన్ని అరెస్ట్ చేయాలని దేశవ్యాప్తంగా పలు పార్టీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. విజయ్ కావాలనే ఆలస్యంగా రావడంతో తొక్కిసలాట జరిగిందని, విజయ్ ఉద్దేశపూర్వకంగా రాజకీయ బలప్రదర్శనకు దిగాలని, అభిమానులు ఎక్కువగా వచ్చే వరకు ఆగి ఆలస్యంగా వచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఇక, 7 గంటలకు విజయ్ వచ్చే సరికి పరిస్థితి అదుపు తప్పి భారీ తొక్కిసలాట జరిగిందని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఈ దుర్ఘటనలో కుట్ర కోణం ఉందని, స్వతంత్ర దర్యాప్తు జరపాలని మద్రాస్ హైకోర్టును టీవీకే పార్టీ ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Next Story