ముంబైలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్

by Muthe.Rajitha |

ఆదివారం ఆస్ట్రేలియాలో పహల్గామ్ తరహా ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ముంబైలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్ కావడం సంచలనం రేపింది.

ముంబైలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆదివారం ఆస్ట్రేలియాలో పహల్గామ్ తరహా ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ముంబైలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్ కావడం సంచలనం రేపింది. వీరు పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు వీరి కార్యకలాపాలను విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారని, ఇదివరకు వీరు గ్యాంగ్ స్టర్స్ గా ఉండేవారని, పంజాబ్ లో అల్లర్లు సృష్టించేందుకు పలు ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపారని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు.

సజన్ మసీహ్, మనీష్ బేది అనే ఇద్దరు ఉగ్రవాదులు.. పాకిస్థాన్‌కు చెందిన ISI మద్దతుతో పనిచేస్తున్న టెర్రరిస్ట్ హర్వీందర్ సింగ్, అమెరికాలో అదుపులో ఉన్న గ్యాంగ్‌స్టర్ హ్యాపీ పాసియన్‌కు కీలకమైన సహాయకులుగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. వీరిద్దరూ దుబాయ్, ఆర్మేనియా సహా విదేశాల్లో నుంచి పనిచేస్తూ పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర నిఘా సంస్థల రహస్య సమాచారంతో పంజాబ్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ లో వీరి ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు డీజీపీ వెల్లడించారు.

Next Story