Punjab Police: వీళ్లు పోలీసులా..? గూండాలా..? జర్నలిస్ట్‌పై విచక్షణారహితంగా దాడి చేసిన ఇద్దరు ఎస్సైలు

by Ramesh Naini |

ఓ స్థానిక జర్నలిస్టుపై ఇద్దరు ఎస్సైలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Punjab Police: వీళ్లు పోలీసులా..? గూండాలా..? జర్నలిస్ట్‌పై విచక్షణారహితంగా దాడి చేసిన ఇద్దరు ఎస్సైలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Attack on journalist) ఓ స్థానిక జర్నలిస్టుపై ఇద్దరు ఎస్సైలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని బటాలాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 1వ తేదీన బటాలాలో ఓ హోటల్ వద్ద (Balvinder Kumar Bhalla) బల్విందర్ కుమార్ భల్లా అనే స్థానిక జర్నలిస్టుపై (Punjab Police) ఇద్దరు పోలీసులు దాడికి దిగారు. మొదట జర్నలిస్టును హోటల్ నుంచి రోడ్డుపైకి కొట్టుకుంటూ తీసుకుని వచ్చి కింద పడేసి బూటు కాళ్లతో తల, వీపు పై పదే పదే తన్నుతూ తీవ్రంగా గాయపరిచారు. తర్వాత అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాక అక్కడి నుంచి ఎస్సైలు (sub-inspectors) ఎస్కేప్ అయ్యారు. అనంతరం స్థానిక ప్రజలు జర్నలిస్ట్‌ను ఆస్పత్రికి తరలించారు.

ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఘటన పంబాబ్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే దాడి చేసింది బటిండాకు చెందిన ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు మన్దీప్ సింగ్, సుర్జీత్ కుమార్‌గా అధికారులు గుర్తించారు. గాయపడిన జర్నలిస్ట్ భల్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై బటాలా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషల్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్టేషన్ హౌస్ ఆఫీసర్ నిర్మల్ సింగ్ తెలిపారు.

జర్నలిస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రకారం.. హోటల్‌లో ఒకరు పోలీస్ డ్రస్‌, మరోకరు సివిల్ డ్రస్‌లో ఉన్న వ్యక్తులు కౌంటర్ వద్ద నిలబడి ఉండటాన్ని గమనించాడు. వారు కొంచెం అనుమానస్పదంగా కనిపించడంతో మీరు బటాలా పోలీసులేనా? అని ప్రశ్నించినందుకు యూనిఫామ్ ధరించిన అధికారికి కోపం వచ్చింది. వెంటనే ఇద్దరు కలిసి కొట్టడం ప్రారభించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. వాళ్ళు పోలీసులా..? గుండాలా..? ప్రజలను రక్షించాల్సిన పోలీసులు ఇలా ప్రవర్తించడం మంచిది కాదని పోలీస్ శాఖకు నెటిజన్లు ఫిర్యాదు చేశారు. దీంతో వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో ముందుగా ఇద్దరు ఎస్సైలను సస్పెండ్ చేసినట్లు సమాచారం. వైరల్ వీడియో..

Next Story