Pakistan: పాకిస్థాన్ లో నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపం

by Shamantha N |

పాకిస్థాన్ లో నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3, 5.8 తీవ్రతో భూమి కంపించింది.

Pakistan: పాకిస్థాన్ లో నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపం
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ లో నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3, 5.8 తీవ్రతో భూమి కంపించింది. శనివారం ఉదయం 11.54 నిమిషాల సమయంలో 4.3 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. పాక్-ఆఫ్ఘన్-తజికిస్తాన్ సరిహద్దు సమీపంలో భూమికి 88 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా స్వాత్, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పరిసర ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. కేవలం 36 నిమిషాల తర్వాత, మధ్యాహ్నం 12:30 గంటలకు రెండోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతగా నమోదైంది. ఈ భూకంప కేంద్రం రావల్పిండికి 60 కిలోమీటర్ల దూరంలో కేవలం 12 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఇస్లామాబాద్, గుజర్ ఖాన్, హరిపూర్, అబోటాబాద్, అటాక్, గుజ్రాన్‌వాలా, సర్గోధ, ఝాంగ్, తక్షశిల, వా కాంట్ సహా పరిసర ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి.

భయాందోళనలో ప్రజలు

భూకంపం రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, దీనివల్ల తక్షణ ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. అత్యవసర ప్రతిస్పందన బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, పపువా న్యూ గినియాలోనూ శనివారం భూకంపం (Earthquake) సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.2గా నమోదైంది. శనివారం కోకోపో పట్టణానికి 115 కి.మీ. దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. పపువా న్యూ గినియా(Papua New Guinea)లో భూకంపాలు సర్వసాధారణమే. అయినప్పటికీ ఈ ప్రకృతి విపత్తు కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Next Story