24 గంటల్లో రెండు రేప్‍లు.. IRS ఆఫీసర్ కూతురిపై అత్యాచారం, హత్య కేసులో షాకింగ్ విషయాలు

by Prasad Jukanti |

ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడి నేర స్వభావం తీవ్ర కలకలం రేపుతోంది.

24 గంటల్లో రెండు రేప్‍లు.. IRS ఆఫీసర్ కూతురిపై అత్యాచారం, హత్య కేసులో షాకింగ్ విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కూతురిపై (22) అత్యాచారం, హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు సదరు ఆఫీసర్ ఇంట్లో మాజీ పని వాడు రాహుల్ మీనా(19)గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన ప్రవర్తన కారణంగా ఇటీవలే పనిలోనుంచి తొలగించడంతో ఆ కుటుంబంపై కక్ష్య పెంచుకున్న రాహుల్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ దారుణానికి కొన్ని గంటల ముందు నిందితుడు తన స్నేహితుడి భార్యపై కూడా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

మృతదేహాన్ని గ్రౌండ్ ఫ్లోర్ కు ఈడ్చుకొచ్చి:

ఢిల్లీలోని కైలాష్ హిల్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సీనియర్ ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో రాహుల్ మీనా గతంలో పనివాడిగా ఉద్యోగం చేశాడు. దాంతో కుటుంబ సభ్యుల దినచర్యపై రాహుల్‌కు పూర్తి అవగాహన ఉంది. తల్లిదండ్రులు ఉదయం వాకింగ్, జిమ్‌కు వెళ్తారని ఆ సమయంలో యువతి ఇంట్లో ఒంటరిగా ఉంటుందని ఇంటి తాళం చెవిని బయట షూ రాక్‌లో ఉంచుతారని రాహుల్ కు తెలుసు. దీంతో నిన్న ఉదయం 6.39 గంటలకు ఇంట్లోకి ప్రవేశించన రాహుల్ 7.20 గంటలకు బయటకు వెళ్ళాడు. ఈ 41 నిమిషాల వ్యవధిలోనే ఇంట్లో ఉన్న అధికారి కుమార్తెపై అత్యాచారం చేసి మొబైల్ చార్జర్ కేబుల్‍తో ఆమె గొంతునులిమి చంపేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అతడి దాడిలో అచేతనంగా పడి ఉన్న యువతిని రూఫ్‌టాప్‌ స్టడీరూమ్‌ నుంచి గ్రౌండ్‌ఫ్లోర్‌కు ఈడ్చుకొచ్చి అక్కడే ఉన్న ఓ సేఫ్‌ లాకర్‍ను ఆమె వేలితో తెరిచి అందులో ఉన్న రూ.7 లక్షల నగదును దోచుకుని అక్కడి నుంచి పరారైయ్యాడు.

అల్వార్‌లోనూ దారుణం..

అయితే ఈ ఘటనకు ముందు మంగళవారం రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఒక స్నేహితుడితో కలిసి రాహుల్ మీనా పెళ్లికి హాజరయ్యాడు. ఎమర్జెన్సీ పని ఉందని చెప్పి ఆ కార్యక్రమం నుంచి ముందుగానే వెళ్లిపోయిన రాహుల్ అతడి స్నేహితుడి ఇంటికి వెళ్లి అక్కడ అతడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన వద్ద ఉన్న ఒక మొబైల్ ఫోన్‌ను రూ.10 వేలకు అమ్మేసి రూ. 6,000తో ఢిల్లీకి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత కైలాష్ హిల్స్ ప్రాంతానికి నడిచి వెళ్లి అక్కడ అధికారి ఇంట్లోకి చొరబడి వారి కూతురిపై అత్యాచారం చేసి చంపేశాడు. 24 గంటల్లోనే రెండు అత్యాచారాలు, దోపిడీకి పాల్పడటంతో రాహుల్ మీనా క్రూర నేర స్వభావం ఇప్పుడు అందరిని ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుండగా పోలీసుల విచారణలో రాహుల్ క్రిమినల్ హిస్టరీ ఏ మేరకు వెలుగులోకి వస్తుందనేది ఉత్కంఠగా మారింది.

Next Story