- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం.. రన్‌వేపై ఢీకొన్న రెండు విమానాలు
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపైకి వెళ్తున్న క్రమంలో ఆకాశ ఎయిర్ (Akasa Air), స్పైస్‌జెట్ (SpiceJet) విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన విమానాశ్రయ వర్గాల్లో, ప్రయాణికుల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. విమానాశ్రయంలో విమానాల కదలికలు (Taxing) జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక విమానం రెక్క (Wing), మరో విమానాన్ని తాకడంతో స్వల్ప నష్టం వాటిల్లింది. ఆకాశ ఎయిర్‌కు చెందిన విమానం (QP 1354) ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. స్పైస్‌జెట్ విమానం కూడా అదే సమయంలో రన్‌వే వైపు వెళ్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు విమానాల్లోనూ ప్రయాణికులు ఉన్నారు. అయితే, విమానాల వేగం చాలా తక్కువగా ఉండటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు.
తీవ్ర అంతరాయం...
ఈ ఘటన కారణంగా విమానాల రెక్కల భాగాలు దెబ్బతిన్నాయి. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా రెండు విమానాలను నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దించి వేరే విమానాల్లో పంపేలా చర్యలు చేపట్టారు. దీనివల్ల పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రన్‌వేపై విమానాలు అనుసరించాల్సిన ప్రోటోకాల్స్‌లో ఎక్కడ లోపం జరిగిందనే అంశంపై విమానయాన నియంత్రణ సంస్థ DGCA (Directorate General of Civil Aviation) విచారణకు ఆదేశించింది. పైలట్ల తప్పిదమా లేక గ్రౌండ్ స్టాఫ్ సిగ్నల్స్‌లో లోపమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ వంటి అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు జరగడం భద్రతా ఏర్పాట్లపై ఆందోళన కలిగిస్తోంది. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.






