తాజ్ మహల్ వద్ద గంగాజలంతో అభిషేకానికి యత్నించిన ఇద్దరు వ్యక్తులు.. కారణమిదే..!

by Geesa Chandu |

తాజ్ మహల్ ను సందర్శించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు, ఆ కట్టడానికి దగ్గరలో ఉన్నటువంటి మెట్లకు సమీపంలో 'ఓం' అనే పేరుతో ఒక స్టిక్కర్ కనిపించటంతో ఆ మెట్లను వారిరువురు గంగాజలం తో అభిషేకించారు.

తాజ్ మహల్ వద్ద గంగాజలంతో అభిషేకానికి యత్నించిన ఇద్దరు వ్యక్తులు.. కారణమిదే..!
X

దిశ, వెబ్ డెస్క్: తాజ్ మహల్ ను సందర్శించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు, ఆ కట్టడానికి దగ్గరలో ఉన్నటువంటి మెట్లకు సమీపంలో 'ఓం' అనే పేరుతో ఒక స్టిక్కర్ కనిపించటంతో ఆ మెట్లను వారిరువురు గంగాజలం తో అభిషేకించారు. అయితే అప్రమత్తమైన పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

సుప్రసిద్ధ కట్టడం తాజ్‌మహల్‌ లోపల గంగా జలంతో అభిషేకం నిర్వహించేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. అందుకు కావాల్సిన గంగాజలాన్ని వాటర్‌ బాటిల్‌లో తెచ్చారు. శ్రావణ మాసం సందర్భంగా అభిషేకం నిర్వహించేందుకు ప్రయత్నించారు. షాజహాన్, ముంతాజ్ మహల్ సమాధులు ఉన్న తాజ్ మహల్‌లోని నేలమాళిగకు దారితీసే.. మూసి ఉన్న మెట్లపై ఒక వ్యక్తి గంగా జలాన్ని పోశాడు. ఆ మెట్ల వద్ద ఓం పేరుతో స్టిక్కర్‌ ఉందని, అందుకే గంగా జలంతో అక్కడ అభిషేకం చేసినట్లు ఆ వ్యక్తులు వాదించారు. అయితే అప్పటికే అప్రమత్తమైన పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Next Story