పాకిస్తాన్‌కు దేశ రహస్యాలు చేరవేస్తున్న ఇద్దరు అరెస్ట్

by Phanindra |

డబ్బు కోసం భారత దేశ రహస్యాలను పాకిస్తాన్‌కు అమ్ముకుంటున్న ఇద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.

పాకిస్తాన్‌కు దేశ రహస్యాలు చేరవేస్తున్న ఇద్దరు అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత సైనిక రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్న ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఆఫీసులో ఉన్న ఒక ఉద్యోగి సాయంతో వీళ్లిద్దరూ భారత రహస్యాలను పాకిస్తానీ హ్యాండ్లర్లకు లీక్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముందుగా తాము ఒక వ్యక్తినే అరెస్టు చేశామని, ఇంటరాగేషన్ సమయంలో అతను మరో వ్యక్తి పేరును బయటపెట్టాడని అధికారులు తెలిపారు. వీరికి పాకిస్తాన్ నుంచి ఆన్‌లైన్‌లో డబ్బులు అందాయని, ఆ డబ్బును లోకన్ పాకిస్తాని ఆపరేటర్లకు కూడా వీళ్లిద్దరే పంచేవారని పోలీసులు వెల్లడించారు. వీరి నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Next Story