- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rat Bite: ఐసీయూలో ఎలుకలు.. ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. ఇద్దరు శిశువులు మృతి
గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో మెయింటెనెన్స్ లోపం వల్ల అప్పుడప్పుడు ఐసీయూలోకి సైతం ఎలుకలు ప్రవేశించి పేషంట్లను కురుస్తుంటాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: (government hospital) ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహణ లోపం తరుచుగా కనిపిస్తూనే ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో మెయింటెనెన్స్ లోపం వల్ల అప్పుడప్పుడు ఐసీయూలోకి సైతం ఎలుకలు ప్రవేశించి పేషంట్లను కురుస్తుంటాయి. ఎలుకలకు సంబంధించిన ఘటన వీడియోలు సోషల్ మీడియాలో కన్పిస్తుంటాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని మహారాజా యశ్వంతరావు (MYH) ఆసుపత్రిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల వ్యవధిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇద్దరు నవజాత శిశువులు ఎలుకలు కరవడంతో మృతి చెందారు. మంగళవారం ఒక శిశువు చనిపోగా.. రెండో శిశువు బుధవారం మృతి చెందింది. అయితే రెండో శిశువుకు మృతికి కారణం ఎలుక కాటు కాదని బ్లడ్ ఇన్షెక్షన్‌తో మృతి చెందిందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కానీ ఓ శిశువు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇందుకు సంబంధించిన వార్త వైరల్ కావడంతో ఎంపీ సీఎం మోహన్ యాదవ్ స్పందించారు. ఆరోగ్య మంత్రి, ఇతర అధికారులతో విచారణకు ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలకు నిర్వహణ లోపంపై హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ.. రెండో శిశువు తక్కువ బరువుతో జన్మించిందని, ఇద్దరు పట్టుకతోనే అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. శిశువుల ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ఓ శిశువు రక్తం ఇన్‌ఫెక్షన్ రావడంతో శిశువు మృతి చెందిందని తెలిపారు.
శిశువు మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు పోస్టుమార్టం నిర్వహించకుండా వారికి అప్పగించామని ఆయన క్లారిటీ ఇచ్చారు. శిశువు ఎడమచేతి రెండు వేళ్లపై ఎలుకలు కరవడంతో గాయాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కానీ వారు ఎలుకలు కరవడంతో శిశువు మృతి చెందలేదన్నారు. ఈ ఘటనల నేపథ్యంలో ఆసుపత్రికి చెందిన ఆరుగురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని అన్నారు. పిల్లల శస్త్రచికిత్స విభాగం అధిపతి డాక్టర్ బ్రజేశ్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కాగా, ఆ ఆస్పత్రి ఐసీయూలో ఎలుకలు ఉన్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.






