- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో మరోసారి ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోలు హతం
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. శనివారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఈ ఎన్ కౌంటర్ జరిగింది. అయితే, కిష్టారామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మాయిస్టులు ఉన్నారన్న సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్), సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. కాగా.. ఈ ఆపరేషన్ లోనే ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు. ఘటనాస్థలి నుంచి ఇప్పటివరకు ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ వెల్లడించారు. అయితే, ఎన్‌కౌంటర్‌తో ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో 83 మంది నక్సలైట్లు హతమయ్యారు. వారిలో 67 మంది బస్తర్ డివిజన్ లోని సుక్మా సహా ఏడు జిల్లాలకు చెందినవారే కావడం గమనార్హం.






