- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెస్సీ కోల్‌కతా పర్యటన.. మరో ఇద్దరి అరెస్ట్
'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కోల్‌కతాలో పాల్గొన్న ఈవెంట్‌లో చోటు చేసుకున్న ఉద్రిక్త ఘటనకు సంబంధించి పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. స్టేడియంలో కుర్చీలు ధ్వంసం చేసి గందరగోళం సృష్టించినందుకు శుభోప్రతిమ్, గౌరబ్ బసు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను మరో 15 రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తామని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఇప్పటికే అరెస్టైన ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను స్థానిక కోర్టు 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మెస్సి సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.






