డ్రగ్స్ కేసు.. కువైట్‌లో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష

by Muthe.Rajitha |

డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో పట్టుబడిన ఇద్దరు భారతీయులకు కోర్టు ఉరిశిక్ష విధించింది.

డ్రగ్స్ కేసు.. కువైట్‌లో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : కువైట్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. భారీ డ్రగ్స్‌తో పట్టుబడిన ఇద్దరు భారతీయులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే, వారు భారత్‌లో ఏ రాష్ట్రానికి చెందినవారనే వివరాలు తెలియరాలేదు. డ్రగ్ ట్రాఫికింగ్‌పై కఠిన చర్యలు చేపట్టిన కువైట్... ఇటీవల ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఈ చర్యల్లో భాగంగా కైఫాన్, షువైఖ్ ప్రాంతాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇద్దరు భారతీయుల వద్ద నుంచి 14 కిలోల హెరాయిన్‌తో పాటు 8 కిలోల మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకొని, వారిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో వారికి అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ మేరకు ప్రాసిక్యూటర్లు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు, నిందితుల నేరం రుజువైనట్లు నిర్ధారించి మరణశిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించింది. కాగా దీనిపై ఇప్పటివరకు భారత ఎంబసీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Next Story