అమెరికాలో ఇద్దరు భారతీయులు అరెస్టు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-07 08:14:57  IST  )

అమెరికాలో ఇద్దరు భారతీయులను యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారులు అరెస్టు చేశారు.

అమెరికాలో ఇద్దరు భారతీయులు అరెస్టు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో (America) ఇద్దరు భారతీయులను (Indians) యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారులు అరెస్టు చేశారు. ఆగస్టు 1వ తేదీన అమెరికా-కెనడా సరిహద్దును అక్రమంగా దాటేందుకు ప్రయత్నించగా, మెనేలోని బ్రిడ్జివాటర్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన పరిణామాలు తప్పవని మరోసారి హెచ్చరించారు. కాగా, ఇటీవలి కాలంలో అమెరికాలోకి అక్రమ చొరబాట్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. 2024లో 34,535 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, 2025లో జనవరి నుంచి మే మధ్యకాలంలో ఈ సంఖ్య 10,382కి తగ్గింది. ఇది సుమారు 70 శాతం తగ్గుదలగా అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డేటా తెలిపింది. ఇక డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయడంతో అరెస్టుల సంఖ్య పెరిగినప్పటికీ, అక్రమ ప్రవేశాలు తగ్గాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే, తమ దేశానికి తిరిగి వెళ్లదలచిన అక్రమ వలసదారులకు అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. స్వచ్ఛందంగా వెళ్లేందుకు ముందుకొచ్చిన వారికి డాక్యుమెంటేషన్, ప్రయాణ ఏర్పాట్లకు తోడుగా 1,000 డాలర్ల ప్రోత్సాహకం అందిస్తోంది.

Next Story