నైజర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు భారత వలసదారులు మృతి

by Phanindra |

పశ్చిమ ఆఫ్రికా దేశం నైజర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు భారత వలసదారులు మృతిచెందారు. ఒకర్ని టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారు.

నైజర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు భారత వలసదారులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ ఆఫ్రికాలోని నైజర్‌ దేశంలో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ వలసదారులు దుర్మరణం పాలయ్యారు. అక్కడ జరిగిన ఉగ్రదాడిలో వీళ్లిద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. మృతులను జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన గణేశ్ కర్మాలీ, దక్షిణాదికి చెందిన కృష్ణన్‌గా గుర్తించినట్లు సమాచారం. అలాగే జమ్మూకశ్మీర్‌కు చెందిన రంజిత్ సింగ్ అనే వ్యక్తిని ఉగ్రవాదులు అపహరించినట్లు అధికారులు తెలిపారు.

నైజర్‌లోని భారత ఎంబసీ కూడా ఈ వార్తలను ధ్రువీకరించింది. జులై 15న డాసో ప్రాంతంలో జరిగిన క్రూరమైన ఉగ్రదాడిలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, ఒకరు కిడ్నాప్ అయ్యారని భారత ఎంబసీ ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎంబసీ.. స్థానిక అధికారులతో మాట్లాడి మృతదేహాలను స్వదేశానికి తెప్పించేందుకు, అలాగే ఉగ్రవాదుల చెరలో ఉన్న భారతీయుడిని విడిపించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. నైజర్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Next Story