- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
అమెరికాలో అగ్నిప్రమాదం జరిగి, ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందారు. వీరిద్దరూ హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిన విద్యార్థులు.. బర్మింగ్‌హామ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృత్యువాతపడ్డారు. మృతులిద్దరూ హైదరాబాద్ వాసులే కావడం గమనార్హం. మృతులను ఉడుముల సహజ రెడ్డి కాగా, మరో విద్యార్థినిని కూకట్ పల్లికి చెందిన యువతిగా గుర్తించారు. వీరంతా మరికొదరు తెలుగు విద్యార్థులతో కలిసి ఒక అపార్ట్‌మెంట్‌లో నివశిస్తున్నారు. ఈ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయాందోళనలకు గురై కేకలు వేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు వచ్చి అపార్ట్‌మెంట్లోని వారిని బయటకు తీసుకొచ్చారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న వారందర్నీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థినిలు మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్లో పది మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా అలబామా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు.






