- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎదురెదురుగా ఢీకొన్న రెండు గూడ్స్ రైళ్లు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు (వీడియో)
ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు గూడ్స్ రైళ్లు ఒకదానినొకటి ఢీ కొన్నాయి. దీంతో రెండు రైళ్లకు చెందని ఇంజన్లు చెల్లాచెదురుగా పడిపోయాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు గూడ్స్ రైళ్లు ఒకదానినొకటి ఢీ కొన్నాయి. దీంతో రెండు రైళ్లకు చెందని ఇంజన్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ భీకర ప్రమాదం.. మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌లోని సింగపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు రైలు డ్రైవర్లకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ప్రమాదం తర్వాత రెండు రైళ్లు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయి ఇంజన్లలో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన లోకో పైలట్‌లను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Next Story






