- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెల్లెళ్ళ పెళ్లి కోసం అష్టకష్టాలు.. చివరికి జాక్ పాట్ కొట్టిన స్నేహితులు
by Muthe.Rajitha |
ఒక్కోసారి అదృష్టం ఎలా వస్తుందో తెలియదు అని నిరూపించేదే ఈ ఘటన.

X
దిశ, వెబ్ డెస్క్ : ఒక్కోసారి అదృష్టం ఎలా వస్తుందో తెలియదు అని నిరూపించేదే ఈ ఘటన. ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న సతీశ్, సాజిద్ అనే ఇద్దరు స్నేహితులు తమ చెల్లెళ్ల పెళ్లి కోసం డబ్బుకు అనేక ఇబ్బందులు పడ్డారు. అనుకోకుండా వచ్చిన ఓ అవకాశంతో పన్నాలోని ఒక గనిని లీజుకు తీసుకుని వజ్రాల వేట మొదలు పెట్టారు. మొదట్లో పెద్ద ఆశలు లేకపోయినా.. కేవలం 20 రోజుల్లోనే 15.34 క్యారెట్ల అత్యంత నాణ్యమైన భారీ వజ్రం వారి చేతికి చిక్కింది.
దీని విలువ మార్కెట్లో ₹50 లక్షలకు పైగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ అనుహ్య అదృష్టంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న ఆ ఇద్దరు స్నేహితులు ముందుగా చెల్లెళ్లకు అద్భుతంగా పెళ్లిళ్లు చేస్తామని, మిగిలిన డబ్బుతో తమ చిన్న చిన్న వ్యాపారాలను మరింతగా అభివృద్ధి చేసుకుంటామని ఆనందం వ్యక్తం చేసారు.
Next Story






