బతుకులు సమాధి.. భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి

by Naga Rani Yarlagadda |

దేశ రాజధాని ఢిల్లీలో.. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో ఐదంతస్తుల కమర్షియల్ భవనం ఒక్కసారిగా కూలిపోయింది.

బతుకులు సమాధి.. భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో.. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో ఐదంతస్తుల కమర్షియల్ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదం ఇద్దరు మరణించగా.. ఒకరిని 26 ఏళ్ల యువకుడు రవిగా గుర్తించారు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి శిథిలాల కింద చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చినట్లు తెలిపారు. సైదుల్లాజాబ్ పరిధిలోని వెస్ట్రన్ మార్గ్ లో కుప్పకూలిన భవనంలో.. కోచింగ్ సెంటర్లు, కెఫేలు, ప్రైవేట్ ఆఫీసులు ఉన్నట్లు సమాచారం. శనివారం ఆఫీసులకు సెలవు కావడంతో ప్రమాద సమయంలో భవనంలో ఎక్కువమంది జనాభా లేరని పోలీసులు తెలిపారు. కాగా.. భవనం పక్కనే ఉన్న రేకులషెడ్డు క్యాంటీన్ పై పడటంతో.. ఆ క్యాంటీన్ కూడా కుప్పకూలింది. నీట్ (NEET) వంటి వైద్య ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు సాధారణంగా ఈ క్యాంటీన్‌కు ఎక్కువగా వస్తుంటారని స్థానికులు తెలిపారు. కాగా.. ప్రమాదంలో గాయపడిన ఎనిమిదిమందిని ఎయిమ్స్ ట్రామా సెంటర్ కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిని తరుణ్ కుమార్ (26) , సాయికా ఖాన్ (27) , నీలం యాదవ్ (25), ఆదిత్య శర్మ (24) , క్షితిజ్ ప్రతాప్ (25) , అనుజ్ దీక్షిత్ (25) , ఆస్థా (25) , విశాల్ (24)లుగా గుర్తించారు.

Next Story