- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. తండ్రి శవాన్ని రెండు ముక్కలు చేసిన కొడుకులు..
మధ్యప్రదేశ్‌లోని టికమ్‌గఢ్ జిల్లాలోని తాల్ లిధోరా గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తమ తండ్రి ధ్యాసి సింగ్ ఘోష్ అంత్యక్రియల విషయంలో వివాదానికి దిగారు అన్నాదమ్ములు దామోదర్ సింగ్, కిషన్ సింగ్. ఇన్నాళ్లు అనారోగ్యంతో

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని టికమ్‌గఢ్ జిల్లాలోని తాల్ లిధోరా గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తమ తండ్రి ధ్యాసి సింగ్ ఘోష్ అంత్యక్రియల విషయంలో వివాదానికి దిగారు అన్నాదమ్ములు దామోదర్ సింగ్, కిషన్ సింగ్. ఇన్నాళ్లు అనారోగ్యంతో బాధపడిన తండ్రిని సంరక్షించిన చిన్న కుమారుడు దామోదర్ అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమవుతుండగా.. మరో చోట నివసించే పెద్ద కుమారుడు కిషన్ వచ్చి తానే దహన సంస్కారాలు నిర్వహిస్తానని పట్టుబట్టాడు. వాగ్వాదం తీవ్రమై.. మద్యం మత్తులో ఉన్న కిషన్.. తండ్రి శరీరాన్ని రెండు భాగాలుగా విభజించాడు. ఇద్దరం విడివిడిగా అంత్యక్రియలు చేద్దామని సూచించాడు.
ఈ ప్రతిపాదన బంధువులు, గ్రామస్తులను షాక్‌కు గురిచేసింది. దాదాపు ఐదు గంటలపాటు శవం ఇంటి బయట ఉండిపోయింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు జోక్యం చేసుకుని.. వివాదాన్ని పరిష్కారించారు. తండ్రికి ఒకేచోట అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా మనుషులు ఇంత దారుణంగా తయారయ్యారేంటని కామెంట్స్ చేస్తున్నారు.






