- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాబ్ జైలులో ఖైదీల మధ్య గొడవ.. ఇద్దరు మృతి
Two Accused In Sidhu Moose Wala Murder Case Killed In Punjab Jail Fight..

చండీగఢ్: సింగర్ సిద్ధు మూస్ వాలా హత్య కేసులో ఇద్దరు నిందితులు ఆదివారం జైలులో జరిగిన ఘర్షణలో హతమయ్యారు. పంజాబ్‌లోని తార్న్ తరణ్ జిల్లా గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలులో ఆదివారం ఖైదీల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు మన్‌దీప్ సింగ్ అలియాస్ తుపాన్ ఆఫ్ బటాలా, మన్మోహన్ సింగ్ అలియాస్ మోహ్నా ఫ్ బుద్లానాలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ఖైదీ కేశల్ ఆఫ్ బటిండాకు గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.
ఈ ముగ్గురూ ఒకే గ్రూప్‌కు చెందిన వారని, సిద్దు హత్య కేసులో నిందితులని ఎస్పీ గుర్‌మీత్ సింగ్ చౌహాన్ తెలిపారు. చనిపోయిన వీరిద్దరూ గతేడాది జరిగిన సింగర్ సిద్ధు మూస్ వాలా హత్య కేసులో నిందితులని పోలీసులు చెప్పారు. ఇతర కేసుల్లోనూ నిందితులుగా ఉన్నారని గుర్‌మీత్ సింగ్ చౌహాన్ తెలిపారు. శుబ్‌దీప్ సింగ్ సిద్ధు... సిద్ధు మూస్ వాలాగా సుపరిచితం. ఈయనను గతేడాది మే 29న మాన్సా జిల్లాలో కాల్చి చంపారు. అంతకుముందు రోజే మూస్ వాలాకున్న సెక్యూరీటిని పంజాబ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆయనపై దుండగులు 30 రౌండ్ల కాల్పులు జరిపారు.






