ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ట్విస్ట్.. అరవింద్ కేజ్రీవాల్‌‌కు ఎదురుదెబ్బ

by Kema Shiva Kumar |

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా హైకోర్టు విచారణను బహిష్కరించిన క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ట్విస్ట్.. అరవింద్ కేజ్రీవాల్‌‌కు ఎదురుదెబ్బ
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ మంత్రి మనీష్ సిసోడియా, దుర్గేష్ పాఠక్ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)లో కీలక చేపట్టింది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని బెంచ్ విచారణకు హాజరయ్యేందుకు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా నిరాకరించారు. సదురు బెంచ్ నుంచి తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, అందుకే సత్యాగ్రహ మార్గంలో విచారణను బహిష్కరిస్తున్నట్లుగా వారు కోర్టుకు సమర్పించిన లేఖలో పేర్కొన్నారు.

అమికిస్ క్యూరీ నియామకం..

నిందితులు ఎవరూ కోర్టుకు హాజరు కాకపోవడంతో, వారి తరపున వాదనలు వినిపించేందుకు, న్యాయస్థానానికి సహాయపడేందుకు ముగ్గురు సీనియర్ న్యాయవాదులను ‘అమికిస్ క్యూరీ’(Amicus Curiae)లను నియమించాలని హైకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. అయితే, గతంలో కేజ్రీవాల్, సిసోడియాను ఈ కేసు నుంచి విడుదల చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ (CBI) దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. దర్యాప్తు సంస్థపై గతంలో కోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలను తొలగించాలని ఈడీ కూడా కోరింది. దీంతో జస్టిస్ స్వర్ణ కాంత శర్మ బెంచ్ నుంచి తాను న్యాయం ఆశించడం లేదని కేజ్రీవాల్ అన్నారు. అందుకే స్వయంగా కానీ, నా న్యాయవాది ద్వారా కానీ ఈ విచారణలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లుగా ఆయన కేజ్రీవాల్ స్పష్టం చేశారు. నిందితులు లేకపోయినా, అమికిస్ క్యూరీల సహాయంతో ఈ కేసు విచారణను ముందుకు తీసుకెళ్లాలని హైకోర్టు భావిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ మద్యం పాలసీ కేసు తదుపరి విచారణలో సీబీఐ, ఈడీ (ED) తమ వాదనలను వినిపించనున్నాయి.

Next Story