SIRపై టీవీకే అధ్యక్షుడు విజయ్ షాకింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

కోలీవుడ్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ షాకింగ్ కామెంట్లు చేశారు. SIR వల్ల లక్షలాది మంది ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. తనతో పాటు తమిళనాడులోని చాలా మంది ఓటర్లు తమ రాజ్యాంగ హక్కును కోల్పోయే అవకాశం ఉందన్నారు.

SIRపై టీవీకే అధ్యక్షుడు విజయ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ షాకింగ్ కామెంట్లు చేశారు. SIR వల్ల లక్షలాది మంది ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. తనతో పాటు తమిళనాడులోని చాలా మంది ఓటర్లు తమ రాజ్యాంగ హక్కును కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో సమస్యలు, ఓటరు జాబితాలో తప్పుల వల్ల లక్షలాది మంది ఓట్లు కోల్పోతారని చెప్పారు. వెంటనే ఓటర్ల జాబితాలో పేర్లను ప్రజలు ధృవీక‌రించుకోవాల‌ని సూచించారు. పేరు లేని ప‌క్షంలో BLOను సంప్ర‌దించి త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకునేలా విజ్ఞ‌ప్తి చేయాల‌న్నారు.

ఇదిలా ఉంటే SIR (Special Intensive Revision) పేరుతో భార‌త ఎన్నిక‌ల సంఘం ఓట‌రు జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ చేప‌డుతోంది. ప్ర‌క్రియ‌లో ఓట‌రు జాబితాల‌ను స‌వ‌రిస్తారు. కొత్త ఓట‌ర్ల‌ను చేర్చ‌డం, త‌ప్పుల‌ను స‌రిచేయ‌డం మ‌రియు చ‌నిపోయిన‌వారు, ఇత‌ర చోట్ల‌కు మారిన‌వాళ్లు, డూప్లికేట్ ఎంట్రీలు, అన‌ర్హులు లాంటి వారి పేర్ల‌ను తొల‌గిస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం SIR ప్రక్రియ కొన‌సాగుతోంది. అయితే దీని వ‌ల్ల కొంత‌మంది అర్హుల ఓట్ల‌ను కూడా తొల‌గిస్తున్నార‌ని ప‌లు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఓట‌ర్ జాబితాలో త‌ప్పుల వ‌ల్ల ఓట్ల‌ను తొల‌గించ‌వ‌ద్ద‌ని కోరుతున్నాయి.

Next Story