- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుదుచ్చేరిలో టీవీకే విజయ్ రాజకీయ సభ.. కలకలంగా మారిన తుపాకీ
టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయ సభ పుదుచ్చేరిలోని ఉప్పలం ఎక్స్‌పో గ్రౌండ్‌లో ఈరోజు జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయ సభ పుదుచ్చేరిలోని ఉప్పలం ఎక్స్‌పో గ్రౌండ్‌లో ఈరోజు జరుగుతోంది. గతంలో కరూర్ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషాద ఘటన తర్వాత విజయ్ నిర్వహిస్తున్న మొట్టమొదటి ప్రధాన బహిరంగ సభ ఇదే. ఈ నేపథ్యంలో, పుదుచ్చేరి పోలీసులు సభకు కట్టుదిట్టమైన భద్రతా ఆంక్షలను విధించారు. సభకు హాజరయ్యే వారి సంఖ్యను 5,000 మందికి మాత్రమే పరిమితం చేయగా, ప్రవేశం కేవలం పార్టీ జారీ చేసిన క్యూఆర్ కోడ్ పాస్‌లు ఉన్నవారికి మాత్రమే అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య విజయ్ ప్రసంగించేందుకు షెడ్యూల్ ఉంది.
భద్రతా కారణాల వల్ల పోలీసులు రోడ్‌షోకు అనుమతి నిరాకరించి, కేవలం బహిరంగ సభకు మాత్రమే అనుమతి ఇచ్చారు. పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్ర ప్రజలు ఎవరూ ఈ సభకు రావద్దని పోలీసులు, పార్టీ నాయకత్వం విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా, చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు కూడా సభకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కట్టుదిట్టమైన భద్రత నడుమ కూడా, సభ ప్రాంగణంలోకి తుపాకీతో ప్రవేశించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకోవడం స్వల్ప కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు, టీవీకే కార్యకర్తల పర్యవేక్షణలో సభ ప్రశాంతంగా కొనసాగుతోంది. అలాగే తుపాకీతో వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.






